నా దర్శనమైయుండు
1. నా దర్శనమైయుండు నా హృదయ ప్రభువా
నీవు తప్ప రక్షకుడెవరు లేరు
నా మంచి ఆలోచన పగలు రాత్రీ
నిద్రించిన మేల్కొన్న నీవే వెలుగు
2. నాదు జ్ఞానమా నా నిజ వాక్యమా
నీతోనే ఎల్లప్పుడు ఉందునయ్యా
నా మంచి తండ్రి నే నీ బిడ్డను
నాలో నివసించు మనమిద్దరం ఒకటై
3. ఈ లోక సంపదలు పొగత్తలు వ్యర్థం
నా వారసత్వము ఎప్పుడు నీవే
నీవే నీవే హృదిలో మొదటిగా
నా గొప్ప మహారాజు నా సంపద నీవే
4. పరలోక రాజువు నా విజయుడవు
ప్రకాశవంతుడా స్వర్గ వెలుగు
ఆ స్వర్గానందం నే పొందుదును
ఎప్పటికి నా దృష్టిగుండు రాజా