ఇమ్మానుయేలు రక్తము

 


ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యూటగు
ఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవును.


Ref
యేసుండు నాకు మారుగా – ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్తమెప్పుడు – శ్రవించు నాకుగా.


ఆ యూట మున్గి దొంగయు – హా శుధ్ధుడాయెను
నేనట్టి పాపినిప్పుడు – నేనందు మున్గుదున్.


నీ యొక్క పాపమట్టిదే – నిర్మూలమౌటకు
రక్షించు గొర్రెపిల్ల – నీ రక్తము చాలును.


నా నాధు రక్తమందున – నే నమ్మియుండినన్
నా దేవుని నిండు ప్రేమ – నేనందు చూచేదన్.


నా యాయుష్కాలమంతట – నా సంతసంబిదే
నా క్రీస్తుయొక్క రొమ్మునన్ – నా గానమిదియే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *