దూరపు కొండపై
1. దూరపు కొండపై శ్రమలకు గుర్తగు
కౄరపు సిలువయే కనబడె
పాపలోకమునకై ప్రాణము నొసగిన
ప్రభుని సిలువను ప్రేమింతున్
పల్లవి:
ప్రియుని సిలువను ప్రేమింతున్
ప్రాణమున్నంత వరకును
హత్తుకొనెదను సిలువను
నిత్యకిరీటము పొందెదన్
2. లోకులు హేళన చేసిన సిలువ
నా కెంతో అమూల్యమైనది
కల్వరిగిరికి సిలువను మోయను
క్రీస్తు మహిమను విడచెను
3. రక్తశిక్తమైన కల్వరి సిలువలో
సౌందర్యంబును నే గాంచితిని
నన్ను క్షమించను పెన్నుగ యేసుడు
ఎన్నదగిన శ్రమ పొందెను
4. వందనస్తుడను యేసుని సిలువకు
నిందను ఈ భువిన్ భరింతు
పరమ గృహమునకు పిలిచెడు దినమున
ప్రభుని మహిమను పొందెద.